రూటు మార్చిన సాయి పల్లవి.. ఇకపై వాటికి రెడీ అంటగా!

అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిదా చిత్రంతో అమ్మడు తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లుగా నిలుస్తుండటంతో ఈ బ్యూటీకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక ఇటీవల ‘లవ్‌స్టోరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, అదిరిపోయే సక్సెస్‌ను అందుకుని అందరికీ మరోసారి షాక్ ఇచ్చింది.

కాగా ఇప్పటివరకు కేవలం సెలెక్టివ్‌గా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తూ వచ్చిన సాయి పల్లవి ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పలానా జోనర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్న పాత్రల్లో నిటించేందుకు అమ్మడు రెడీ అవుతున్నట్లు సినీ లోకం కోడై కూస్తోంది. ఇప్పటికే కామెడీ ఓరియెంటెడ్ పాత్రలు వస్తే చేస్తానని చెప్పిన సాయి పల్లవి అలాంటి మంచి సబ్జెక్టు తగిలితే ఖచ్చితంగా నటిస్తానంటోంది.

అటు ఎక్స్‌పోజింగ్‌కు ఇప్పటివరకు ఛాన్స్ ఇవ్వని ఈ బ్యూటీ, సినిమా డిమాండ్ చేస్తే కొంతమేర అందుకు కూడా రెడీనే అంటోన్నట్లు చిత్ర వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే సాయి పల్లవి కామెడీ, రొమాంటిక్ చిత్రాల్లో నటిస్తే ఆమె ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే ఊహాగానాలు అప్పుడే ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Share post:

Latest