పుష్ప ‘సామి.. సామి..’ పాట గోవిందా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఇటీవల ఈ సినిమాను నుండి ‘సామీ.. సామీ..’ అంటూ వచ్చిన ఊరమాస్ ఫోక్ సాంగ్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు మరో లెవెల్‌లో ఉన్నాయనే అభిప్రాయం అప్పుడే ఆడియెన్స్‌లో కలుగుతోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను హిందీ భాషలో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా ఈ హిందీ వర్షన్‌లో ‘సామీ.. సామీ..’ పాట ఉండబోదనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ పాట కేవలం తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉందనే అభిప్రాయం రావడంతో ఈ పాటను హిందీలో లేపేస్తున్నారట చిత్ర యూనిట్.

బన్నీ ఊరమాస్ లుక్‌కు రష్మిక మందన డీగ్లామర్ తోడవ్వడంతో ఈ సిినమా మరో రేంజ్‌కు వెళ్లడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు పాహద్ ఫజిల్, సునీల్ విలన్ పాత్రల్లో నటించబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. మరి ఈ సినిమా హిందీ వర్షన్‌లో నిజంగానే మార్పులు చేర్పులు ఉంటాయా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest