RRR మూవీ గ్లింప్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్..!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం RRR ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి గ్లింప్స్ విడుదల అవ్వడం జరిగింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమా గ్లింప్స్ చూస్తే రికార్డులను కొల్లగొడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా గ్లింప్స్ పై అల్లు అర్జున్ స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్ అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. ఇండియా సినిమా కి రాజమౌళి గర్వకారణం అని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు పవర్ ప్యాక్ షో అని చెప్పుకొచ్చారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్యులేషన్ తెలియజేశారు అల్లు అర్జున్. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉన్నది.

Share post:

Latest