RRR సినిమా నుంచి లీకైన ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటోస్.. వైరల్..!

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR ఈ సినిమాని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్ననాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి అభిమానులకు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లపై మంచి స్పందన రావడం విశేషం. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి కూడా పాల్గొన్నాడు.

అయితే తాజాగా ఈ సినిమా నుండి ఎన్టీఆర్ కు సంబంధించి ఒక ఫోటో కొద్ది గంటల క్రితం లీక్ అయింది. ఇప్పుడు ఆ ఫోటో కాస్త వైరల్ గా మారుతుంది. ఎన్టీఆర్ సినిమాలో కొమరం భీమ్ లుక్ లో కనిపించాడు. అంతేకాకుండా ఈ లీకైన ఫోటోలో చూస్తే ఎన్టీఆర్ తలకు రుమాలు చుట్టుకొని.. వెనకాల తుపాకి తగిలించుకుని. చాలా గంభీరంగా చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ ఫోటో ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం తెగ నచ్చేసింది అని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధిస్తుందో, ఎన్ని రికార్డులను తిరగరాస్తుంది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

https://twitter.com/harishjayraj20/status/1455910509031555078?s=20