రిలేషన్ షిప్ స్టేటస్ పై ఓపెన్ అయిన రష్మిక?

శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. ఈ తమిళంలో మిషన్ మజ్ను సినిమాతో రష్మిక బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన రిలేషన్ షిప్ స్టేటస్ ఫై ఓపెన్ అయింది రష్మిక మందన.

మీ కంటే చిన్నవాడితో డేటింగ్ చేస్తారా?అని రష్మిక అని ప్రశ్నించగా.. ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది. వారు మిమ్మల్ని మార్చేందుకు ప్రయత్నించకూడదు. అప్పుడు ఏజ్ అన్నది పెద్ద విషయం ఏమీ కాదు అని తెలిపింది. అయితే కొంతకాలంగా రష్మిక డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇలాంటి స్టేట్మెంట్ రావడంతో మరిన్ని ఊహాగానాలకు తావిచ్చినట్టు అయింది.ఇక సోషల్‌ మీడియాలో చొక్కా లేకుండా ఫోజులిచ్చే అబ్బాయిల గురించి మాట్లాడుతూ.. వాళ్లు కష్టపడి ఫిట్‌గా కనిపించడాన్ని నేను నిజంగా అభినందిస్తున్న అని సమాధానం ఇచ్చింది.

Share post:

Popular