నీ పెళ్ళాం ఏదిరా అంటే..లేచిపోయింది అంటున్న ఆనంద్..వీడియో వైరల్..!

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ దేవరకొండ , అనతికాలంలోనే యూత్ లో ఒక ట్రెండ్ ను సెట్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమా తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు ఇటీవల నిర్మాతగా కూడా అవతారమెత్తాడు.. తన సినిమా షూటింగ్ లకు హాజరవుతూనే, మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా చూసుకుంటూ చక్కగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా తన సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా విజయ్ నిర్మించిన చిత్రం పుష్పకవిమానం.

Arjun Reddy star Vijay Deverakonda tears up at Dorasani event: My brother worked in US so I could act - Movies News
ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అయిపోయాడు.. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ అభిమానుల కేరింతలతో వైజాగ్ లో ఆ ప్రాంతం మొత్తం సందడిగా మారింది. ఇక ఈ వేదికపై తనను ఆదరించినట్లు తన తమ్ముడి ఆనంద్ ను కూడా ఆదరించాలని అభిమానులను కోరాడు విజయ్.. ఇక ఈవెంట్ కు ముందు రోజు ఒక హోటల్లో బస చేశారు . అందులో విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ ఇద్దరు కలిసి ఒకే బెడ్ షేర్ చేసుకున్నారు.. ఇక ఈరోజు నా బెడ్ ను షేర్ చేసుకుంది ఎవరో చూడండి అంటూ కెమెరాను తన పక్కనే పడుకున్న వ్యక్తి వైపు తిప్పుతూ దుప్పటి లాగాడు..

Vijay Deverakonda, brother to join hands with 'Arjun Reddy' director for a web series | The News Minute
ఇక అక్కడ ఆనంద్ ఉన్నాడు.. ఆనంద్ వైపు కెమెరా చూపిస్తూ.. “నీ పెళ్ళాం ఏదిరా” అంటూ అడగడంతో నిద్రమత్తులో ఉన్న ఆనంద్ కొద్దిగా చిరాకు పడుతూ.. కొద్దిసేపు కెమెరా వైపు చూసి” లేచిపోయింది రా భయ్” అంటూ చెబుతాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest