నటి దివ్యవాణి..బుల్లెట్ బండి సాంగ్ కి డాన్స్ వీడియో వైరల్..!

బుల్లెట్ బండి.. అనే పాట గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా.. ఈ పాటే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీస్ వరకు ఈ పాటకు స్టెప్పులు వేస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో పెళ్లి కూతుర్లే ఎక్కువగా ఈ పాటకి డాన్స్ వేస్తున్నారు.

అయితే తాజాగా సీనియర్ యాక్టర్, టిడిపి పార్టీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి కూడా.. బుల్లెట్ బండి పాటకు డాన్స్ వేసింది. ఎప్పుడూ పార్టీ పనులు, స్పీచ్ లతో హడావిడి గా ఉండే దివ్య, ఆకుపచ్చ చీరలో ఉత్సాహంగా స్టెప్పులు వేసింది. తనదైన శైలిలో డాన్స్ వేస్తూ, ఎక్స్ప్రెషన్ ఇస్తూ అక్కడున్న వారిని ఆకట్టుకుంది. రాత్రి పూట రోడ్డుమీద దివ్యవాణి ఇలా హుషారుగా డ్యాన్స్ వేయడంతో.. ఆ వీడియో బాగా వైరల్ గా మారుతుంది.

ఎప్పుడు స్పీచ్ లతో సీరియస్ గా కనిపించే దివ్యవాణి ఇలా డ్యాన్స్ వేయడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక కొంతమంది అభిమానులు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest