మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా.. నిజం ఎంత..?

ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో దర్శకుడు గా ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ మారుతి. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన కామెడీ సినిమాలను తీసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ముందుకు వస్తున్నారు. కానీ డైరెక్టర్ మారుతి మాత్రం తన కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రావడం లేదు.

అప్పట్లో అల్లు అర్జున్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు బాగా వినిపించాయి.కానీ డైరెక్టర్ మారుతి-హీరో బన్నీ మంచి స్నేహితులు. అయితే ఎప్పటికైనా వీరిద్దరి కాంబినేషన్ గా ఒక సినిమా రావడం కచ్చితంగా వస్తుంది అన్నట్టుగా అభిమానులు భావిస్తున్నారు.అయితే చిరంజీవి తో ఒక సినిమా చేయబోతున్నాడు.

ఇప్పుడు తాజాగా స్టార్ హీరో ప్రభాస్ తో మారుతి డైరెక్షన్లో సినిమా ఉండబోతోందని వార్త ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఈ సినిమాను u.v క్రియేషన్ బ్యానర్లో నిర్మించబోతున్నారు అని కూడా వార్త బాగా వినిపించింది. అయితే మారుతి లాంటి డైరెక్టర్ ప్రభాస్ ను ఎంతవరకు హ్యాండీ చేయగలరని సందేహాలు తలెత్తుతున్నాయి. మారుతి మటుకు ప్రభాస్ తో సినిమా చేస్తాం అన్న విషయంపై ఎలాంటి నిజం లేదు. నేను ఎప్పుడు హీరోలను దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకుని తన కథకు ఎవరైతే బాగుంటారు వారిని ఎంచుకుంటారని తెలియజేశాడు.

Share post:

Latest