మేజర్ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. వీడియో వైరల్..!!

హీరో అడవి శేషు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పేరు మేజర్. ఈ చిత్రంలో శోభితధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి మురళిశర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.Major wraps up shoot – Release date locked | 123telugu.com

ఈ సినిమాను సోని పిక్చర్స్ ఫిలిం మీడియా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి భారీ ప్రకటన విడుదలైంది. ఈ చిత్రం నుండి ఒక వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్ సభ్యులు. ఇక అందులోనే తన సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ఒక సరి కొత్త పోస్టర్లతో ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం ఒకేసారి తెలుగు తమిళ హిందీ మలయాళం లో కూడా విడుదల కానుంది. ఈ మేకింగ్ వీడియోలో అడవి శేషు సరికొత్త గా కనిపిస్తున్నాడు.

Share post:

Popular