ద్రవిడ్ ని పిచ్చపిచ్చగా లవ్ చేశా.. బాలీవుడ్ యాక్ట్రెస్ కామెంట్స్ వైరల్..!

క్రికెట్ లో సచిన్,గంగూలీ, లక్ష్మణ్ సమకాలికుడైన రాహుల్ ద్రావిడ్ తన ఆటతో ఇండియన్ వాల్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వందకు పైగా టెస్టులు, 300కు పైగా వన్డేలు ఆడిన ద్రావిడ్ క్రికెట్ కు 2012లో రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా ఇటీవల ద్రావిడ్ టీమిండియా కోచ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ద్రావిడ్ పై బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

నా ఫస్ట్ లవ్ ద్రావిడ్ అని రిచా చద్దా చేసిన కామెంట్స్ ప్రస్తుతం
సెన్సేషన్ గా మారాయి. మామూలుగా క్రికెటర్లు కానీ, ఇతర ఆటలకు సంబంధించిన ప్లేయర్స్ పై గానీ అమ్మాయిలతో అఫైర్స్ పై తరచుగా వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ద్రావిడ్ ఒక స్టార్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకొని కూడా ఎప్పుడూ హద్దుల్లోనే ఉండేవాడు. అతడిపై ఎప్పుడూ అమ్మాయిల కు సంబంధించి గాసిప్స్ వచ్చింది లేదు. ద్రావిడ్ ఆట పట్ల ఎంతో మమకారం చూపుతూ క్రమశిక్షణగా మెలిగేవాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న ద్రావిడ్ పట్ల తన ఫీలింగ్స్ తెలుపుతూ రిచా చద్దా కామెంట్స్ చేసింది.

‘ నా చిన్నతనంలో నేను క్రికెట్ కు పెద్ద అభిమానిని కాదు. మా అన్నకి క్రికెట్ అంటే ఇష్టం. కానీ అప్పుడప్పుడు అన్నయ్యతో కలిసి టీవీ లో మ్యాచులు చూసేదాన్ని. రాహుల్ ద్రావిడ్ ఆట అంటే నాకు ఎంతో ఇష్టం. నా మొదటి మొహబ్బత్ రాహుల్. ద్రావిడ్ కోసమే మ్యాచ్ లు చూసేదాన్ని. ద్రావిడ్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ చూడటం మానేశా. ఇప్పుడు ద్రావిడ్ టీమిండియా కోచ్ గా డ్రెస్సింగ్ రూమ్ లో కనిపిస్తాడు. అందుకే మళ్లీ మ్యాచ్ లు చూడటం ప్రారంభిస్తా.’ అని టైమ్స్ ఆఫ్ ఇండియా కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

Share post:

Latest