ఖిలాడి మూవీ నుంచి టైటిల్ సాంగ్ విడుదల..వీడియో వైరల్..!!

ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఖిలాడి. ఈ సినిమాను మాస్ మహారాజా రవితేజ జెట్ స్పీడ్లో కంప్లీట్ చేస్తున్నాడు. రవితేజ సినీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అలాగే భారీ యాక్షన్ సినిమా గా తెరకెక్కుతోంది. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆల్బమ్ నుంచి దీపావళి కానుకగా ఈ చిత్రం టైటిల్ సాంగ్ విడుదల చేశారు..

ఈ పాట మాత్రం అంచనాలను ఏ మాత్రం తీసిపోకుండా స్టైలిష్ బీట్ తో మంచి హమ్మింగ్ చేసే విధంగా అనిపిస్తోంది. అంతేకాదు ఈ సాంగ్ విజువల్స్ లో రవితేజ డ్రెస్సింగ్ హైలెట్ అనిపిస్తోంది.. సినిమాలో రవితేజ పాత్ర ఎలా ఉంటుంది అనే విధంగా లిరిక్స్ కూడా బాగున్నాయి.. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన పాట మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేసే విధంగా లేదు. అంతేకాదు ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రలు చేస్తుండగా మీనాక్షి , డింపుల్ హాయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ మరియు ఎ స్టూడియోస్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Share post:

Latest