కార్తికేయ..రాజా విక్రమార్క ట్రైలర్ అదుర్స్..!

యంగ్ హీరో కార్తికేయ, దర్శకుడు శ్రీ సారిపల్లి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క” ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా ఈ రోజున విడుదల చేయడం జరిగింది. అది కూడా హీరో నాని చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. ఇందులో లో కార్తికేయ NIA ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

ట్రైలర్ లో ముఖ్యంగా కామెడీ, ట్విస్ట్ లతో కూడిన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో కార్తికేయ నటన, మాటలు, కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఇందులో తనికెళ్ళ భరణి, సాయికుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు గా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కూడా అ ప్లస్ కానుంది.

ఏది ఏమైనా హీరో కార్తికేయ ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం చాలా గట్టిగా పెట్టుకున్నాడు. మొదటిసారిగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు కార్తికేయ. ఈ సినిమా సక్సెస్ తో నైనా హీరోగా రాణిస్తాడా లేదు తెలియాలంటే.. మరొక కొద్దిరోజులు ఆగాల్సిందే.

Share post:

Latest