కరోనా తరువాత..100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి చిన్న సినిమా ఇదే..!

కరోనా వైరస్ సెకండ్ దేవ తర్వాత థియేటర్ లో సినిమాలు విడుదల చేయడానికి ఆలోచిస్తున్న సమయంలో కొన్ని సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ చిత్రం మాత్రం అంతకుమించి విజయాన్ని అందుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా ఈ చిత్రం వంద కోట్ల రూపాయల క్లుబ్ లో చేరింది.

ఇందుకు సంబంధించి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ ప్రేక్షకులకు అభిమానులకు థ్యాంక్స్ తెలియజేయడం జరిగింది. ఈ సినిమాను ఇంత ఘన విజయం సాధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలియజేశాడు డైరెక్టర్, నిర్మాత గా , నటుడిగా నన్ను నమ్మినందుకు శివకార్తికేయన్ కి ఎప్పుడు రుణపడి ఉంటాను అని తెలియజేశాడు.

ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటే చెప్పుకొచ్చాడు డైరెక్టర్ నెల్సన్. ఇక ఈ డాక్టర్ మూవీ తెలుగు టియేటర్ లో కూడా విడుదలై మంచి సక్సెస్ బాట పట్టింది. అంతేకాకుండా ఈ సినిమా కరోనా తర్వాత 100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా తెరకెక్కింది.

Share post:

Latest