తొడ అందాలతో దడ పుట్టించిన ఫైర్ బ్రాండ్ బ్యూటీ

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అందాల భామ కంగనా రనౌత్, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన ఈమె అనేక అవార్డులు రివార్డులను సొంతం చేసుకుంది. కెరీర్ తొలినాళ్లలో అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేకుండా కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించిన ఈ బ్యూటీ, ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఆమె చేసిన అందాల ప్రదర్శన బాలీవుడ్ వర్గాలను అవాక్కయ్యేలా చేసింది.

కంగనా రనౌత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తేజస్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ వ్రాప్ అప్ పార్టీని నిర్వహించింది. ఈ పార్టీకి తన తొడ అందాలతో కనువిందు చేసేలా కంగనా రావడం అక్కడున్నవారి గుండెల్లో దడ పుట్టించింది. ఆమె వేసుకున్న థైహై డ్రెస్ అక్కడున్నవారి దృష్టిని కేవలం ఆమె తొడలపై మాత్రమే పడేలా చేసింది. ఇక కంగనా ఇచ్చిన థై ఫీస్ట్‌ను అక్కడున్న కెమెరామెన్లు క్లిక్కుమనిపించగా, ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ‘తేజస్’ చిత్రంలో కంగనా రనౌత్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ తేజస్ గిల్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడంతో కంగనా పర్ఫార్మెన్స్ కోసం ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో కంగనా నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు సదరు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాను సర్వేష్ మెవారా తెరకెక్కిస్తుండగా RSVP మూవీస్ బ్యానర్‌వారు ప్రొ్డ్యూస్ చేస్తున్నారు.