ఆకట్టుకుంటున్న సూపర్ మచ్చి టీజర్?

పులి వాసు దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం సూపర్ మచ్చి. ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై, రిజ్వాన్ ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా,కరోనా వల్ల ఆలస్యం అయ్యింది.కరోనా తరువాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ టీజర్ ను రిలీజ్ చేశారు.

ఇందులో హీరోయిన్ రియా చక్రవర్తి, రచితా రామ్ నటించారు. ఈ సినిమా విడుదల కోసం కళ్యాణ్ దేవ్ చాలాకాలంగా ఎదురు చూస్తున్నాడు. ఈసారి మాస్ ఆడియన్సి కి కూడా చేరువ కావాలి అన్న ఉద్దేశంతో ఈ కథను ఎంచుకున్నాడు.

మరి హీరో కళ్యాణ్ దేవ్ అనుకుంటున్న విధంగా అతని ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి. కళ్యాణ్ దేవ్ మొదటి విజేత సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అప్పటి నుంచి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు

Share post:

Latest