సూర్య నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత.. ఏం జరిగిందంటే?

కోలీవుడ్ నటుడు సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్. ఇటీవలే ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ పెద్ద ఎత్తున ప్రజలు గుర్తిస్తున్నారు. ఒకవైపు విమర్శలు ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా పై విమర్శలు కూడా అంతేస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.

వన్నియర్ సంగం తమ ప్రతిష్టను దిగజార్చారు అంటూ ఇప్పటికే చిత్ర యూనిట్ కు లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. దీని తర్వాత సూర్య కు అనేక బెదిరింపులు వస్తుండటంతో పోలీసులు ఆయనకు భద్రతను కల్పించారు. చెన్నై లోని అతని నివాసం వద్ద పోలీసులు భద్రత కల్పించడం జరిగింది. మరొకవైపు సూర్యకు పలువురు ప్రముఖులు, అతని అభిమానులు అండగా నిలుస్తున్నారు. ట్విట్టర్ లో #WeStandwithSuriya అనే హాస్టల్ ట్రెండ్ చేస్తున్నారు. అలాగే సూర్య కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెడుతున్నారు.