హీరో నిఖిల్..18 పేజెస్.. రిలీజ్ డేట్ లాక్..!

టాలీవుడ్ లో పలు ఆసక్తికరమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు హీరో నిఖిల్. తన నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే, మంచి థ్రిల్లర్ గా ఉంటుందని ఒక మార్కు ను సెట్ చేసుకున్నాడు నిఖిల్. తాజాగా నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్ సినిమా కూడా ఒక విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథను డైరెక్టర్ సుకుమార్ కథ తో పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు తాజాగా ఒక అప్ డేట్ వచ్చింది వాటి గురించి చూద్దాం.

18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 న ప్రేక్షకుల ముందుకు రాస్తున్నట్లుగా ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఈ సినిమాని సక్సెస్ఫుల్ బ్యానర్ గా పేరు పొందిన గీత ఆర్ట్స్-2  బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా వ్యవరిస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share post:

Latest