గని సినిమా టీజర్ తో..మరో మెట్టు పైకిఎక్కిన వరుణ్ తేజ్.. టీజర్ వైరల్..!!

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గని టీజర్ రానే వచ్చింది.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ టీజర్ లో వరుణ్ తేజ్ ఎంతో అద్భుతంగా నటించాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల అయితే ఖచ్చితంగా ఈయన బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అని ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీజర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందివ్వడం ప్లస్ పాయింట్ అనిపిస్తోంది.

వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు హీరో వరుణ్ తేజ్.. ఇక మెగా అభిమానులు కూడా వరుణ్ తేజ్ ఈసారి పక్కాగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటాడు అంటూ ఆనందాలను వ్యక్తం చేస్తున్నారు..ఏది ఏమైనా ఈ టీజర్ చూస్తే కచ్చితంగా వరుణ్ తేజ్ విజయాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు.

Share post:

Latest