ఆ సీక్వెల్‌ను ‘ఢీ’కొంటున్న జాతిరత్నాలు భామ!

థియేటర్లకు ఎగబడేవారు. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీక్వెల్ సినిమా అయినా కూడా కథలో పస లేకపోతే అదో నస అంటున్నారు నేటి ప్రేక్షకులు. ఇప్పుడు ఇలాంటిదే ఓ ఆసక్తికరమైన సీక్వెల్ చిత్రం గురించి చర్చ సాగుతోంది. గతంలో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘ఢీ’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మంచు విష్ణు, జెనీలియా, శ్రీహరి నటన ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెప్పాలి.

ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా కామెడీ వర్షన్ ఎవరికి అందనంత ఎత్తులో ఈ సినిమాను నిల్చోబెట్టాయి. అయితే ఈ సినిమాకు ఎప్పటికైనా సీక్వెల్ చేస్తానని దర్శకుడు శ్రీను వైట్ల పదేపదే చెబుతూ వస్తున్నాడు.

కాగా ప్రస్తుతం ఇది కార్యరూపం దాల్చుతుందని చెప్పాలి. ఇప్పటికే ఢీ సీక్వెల్ కోసం లొకేషన్లు కూడా చుట్టేశారు చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా జాతిరత్నాలు భామ ఫారియా అబ్ధుల్లాను సెలెక్ట్ చేశారట దర్శకనిర్మాతలు.

ఇక ఈ విషయానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఏదేమైనా జాతిరత్నాలు హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాలో ఎలాంటి కామెడీ పండుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Share post:

Latest