తండ్రి దెబ్బలు తాళలేక కోమాలోకి వెళ్లిన హీరోయిన్.. ఎవరంటే?

సాధారణంగా తల్లిదండ్రులు వారి పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలి అని పరితపిస్తూ ఉంటారు. అందుకోసం వారు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే అందరి విషయంలో ఇదే ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మన హీరోయిన్ నటి ఆర్తి అగర్వాల్ విషయంలో ఇలా జరగలేదు. ఆర్తి అగర్వాల్ తండ్రి ఆమె సంపాదన పై ఆధారపడ్డారు.

ఆర్తి అగర్వాల్ తండ్రి శశాంక్ అగర్వాల్ నిత్యం డబ్బుల కోసం ఆర్తి అగర్వాల్ ని హింసించేవాడట. డబ్బు కోసం తనకు ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి పంపించాడట. అలా పండు తట్టుకోలేక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆర్తి అగర్వాల్ ఇది మొదట్లో మంచి విజయాలను అందుకున్నప్పటికీ, అధిక శరీర బరువు పెరగడం వల్ల ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.అలా అవకాశాలు తగ్గినప్పటికీ చిన్న సినిమాల్లో నటించాలని ఆమె తండ్రి ఆమెకు ఒత్తిడి తెచ్చారట.

ఆర్తి అగర్వాల్ తండ్రి సినిమా కథను తానే విని రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ చేసేవారట. ఆమె తన తండ్రికి ఎదురు చెబితే ఇంట్లో పని వాళ్ళ ముందు ఆమెను తిట్టడమే కాకుండా కొట్టడం కూడా చేసేవారట. ఒకసారి ఆర్తి అగర్వాల్ ను తన తండ్రి కొట్టడంతో ఆమె ఏకంగా కోమాలోకి వెళ్లిపోయిందట. అదృష్టం బాగుంది బయటపడటం, అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కూడా తన భర్తతో విడాకులు ఇప్పించి తన తండ్రి మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆమెను బలవంతం పెట్టాడట.సినిమాలలో నటించాలని భావించిన ఆర్తి అగర్వాల్ శరీర బరువును తగ్గించడం కోసం చేసిన శస్త్రచికిత్స ఫెయిల్ అవడంతో ఆమె మరణించింది.

Share post:

Popular