దీపావళి కానుకగా లైగర్ నుంచి అదిరిపోయే అప్డేట్.. పోస్టర్ వైరల్..!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా సినిమా లైగర్.. సెన్సేషనల్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ హీరోగా , అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే పూరీకి హిట్ ట్రాక్ అయిన బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పూరీ జగన్నాథ్. ఇక ఈ చిత్రానికి మరో బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏమిటంటే హాలీవుడ్ అండ్ వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ ని రంగంలోకి దింపడం తో ఈ సినిమా మరో స్థాయికి వెళ్లింది.

అంతే కాదు మైక్ టైసన్ కి ఫస్ట్ ఇండియన్ మూవీ కూడా ఇదే కావడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమా మేకర్స్ దీపావళి కానుకగా ఒక సాలిడ్ పోస్టర్ మైక్ టైసన్ కు సంబంధించి ఇండియా కి పరిచయం చేస్తూ నమస్తే ఇండియా అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.. ఇక ఇతను తన స్టాండింగ్ పంచ్ పోస్టర్ తో ఇందులో అదిరే లెవల్లో కనిపిస్తున్నాడు.. ఈ పోస్టర్ చూసి అందరూ విజయ్ దేవరకొండ తో ఎలాంటి స్టన్స్ చేస్తాడో అంటూ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest