డేటింగ్ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక..?

డేటింగ్ పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. డేటింగ్ చేసే వ్యక్తి మన గురించి మంచి అభిప్రాయం తో ఉండాలని తెలియజేసింది. అలా ఉంటే వ‌య‌స్సు తో సంబంధం లేకుండా డేటింగ్ చేయవచ్చునని రష్మిక చెప్పుకొచ్చింది. వయస్సు అనేది చాలా చిన్న అంశమని రష్మిక వెల్లడించింది.

అబ్బాయి నచ్చితే వ‌య‌స్సు తో సంబంధం లేకుండా మనం డేటింగ్ చేయవచ్చని తెలియజేసింది. కానీ ఆ అబ్బాయి కూడా మనల్ని మార్చకుండా ఉండాలని తెలిపింది. అయితే రష్మిక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా రష్మిక బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మిషన్ మజ్ను, అనే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నది. అందులో భాగంగానే హీరోయిన్ రష్మిక మందన ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి వాక్యాలను తెలియజేసింది.

రష్మిక ఈ వార్తలు చేయడంపై సోషల్ మీడియాలో బాగా చర్చించుకుంటున్నారు.

Share post:

Latest