బండ్ల గణేష్ సినిమా కు సహాయం చేస్తున్న డైరెక్టర్ పూరి..!

బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డేగల బాబ్జి. ఈ సినిమాను డైరెక్టర్ వెంకట చంద్ర నిర్మిస్తున్నారు. ఇక ఆయన నటిస్తున్న సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమానే ఓత్త సెరుప్ సైజ్ -7 ఈ చిత్రాన్ని రీమేక్ గా చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించి కొన్ని పోస్టులు కూడా విడుదలై ప్రేక్షకుల అభిమానం బాగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ పై బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెలియజేశాడు. ఈ చిత్రం ట్రైలర్ ను డైరెక్టర్ విడుదల చేయనున్నట్లు ఒక పోస్టు ద్వారా తెలియజేశారు. ఈ సినిమా చేయాలని రేపు ఉదయం 9:35 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలియజేశారు.

ట్రైలర్ను విడుదల చేస్తున్నందుకు పూరి జగన్నాథ్ కు ధన్యవాదాలు తెలియజేశారు బండ్ల గణేష్. ఈ సినిమాకి సంబంధించి మరికొన్ని వివరాలు త్వరలోనే అన్నింటినీ అప్డేట్ ఇస్తామని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. ఏది ఏమైనా బండ్లగణేష్ హీరోగా సినిమా తీయడం గమనార్హం.