బాలకృష్ణ తో నటించడానికి.. వరుస కడుతున్న కుర్ర హీరోయిన్స్..!

డాన్ శీను, బలుపు, పండగ చేస్కో వంటి సినిమాలను తెరకెక్కించి మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్ మలినేని. అయితే రవితేజ నటించిన క్రాక్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ ను సాధించాడు.ప్రస్తుతం బాలకృష్ణ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు బాగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ ను డైరెక్టర్ తీసుకోబోతున్నట్లు గా వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త ఏమిటంటే.. మరొక హీరోయిన్ భావనను కూడా ఈ సినిమాలో తీసుకోబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య కూ సూటయ్యే కథను డైరెక్టర్ గోపీచంద్ కథను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించే విధంగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఈ కథను కూడా డైరెక్టర్ గోపీచంద్ బాలకృష్ణకు వినిపించటం జరిగిందట. బోయపాటితో సినిమా అయిపోగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఏది ఏమైనా బాలకృష్ణతో ఎక్కువగా కుర్ర హీరోయిన్స్ తో నటించే అవకాశం బాగా వస్తుంది.