`అఖండ` టైటిల్‌ సాంగ్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న చిత్రం `అఖండ‌`. ప్రగ్యాజైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ మూవీలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Akhanda: Balakrishna looks electrifying as Aghora in the title song crooned by Shankar Mahadevan | PINKVILLA

ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా అఖండ టైటిల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. ‘భం…అఖండ’ అనే లిరిక్స్‌తో సాగిపోయే ఈ సాంగ్ అంద‌రికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దాదాపు అంద‌రికీ మంచి మాస్‌ కిక్ ఇస్తున్న ఈ సాంగ్విడుదలైన కాసేపటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

Akhanda Title Song Promo: Treat For Fans!

ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను శంకర్‌ మహదేవన్‌, సిద్ధార్థ్‌ మహదేవన్‌, శివమ్‌ మహదేవన్ అద్భుతంగా ఆలపించారు. అలాగే సాంగ్‌లో బాలయ్య వాకింగ్‌ స్టైల్‌, బాడీ లాంగ్వేజ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ఈ సాంగ్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

Share post:

Latest