సుమ అన్నంత ప‌నీ చేసిందిగా..వైర‌ల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌!

బుల్లితెర‌పై ముకుఠం లేని మ‌హారాణిలా దూసుకుపోతున్న ప్ర‌ముఖ స్టార్ యాంక‌ర్ సుమ త్వ‌ర‌లోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడ‌ని త‌న‌దైన శైలిలో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, త్వ‌ర‌లోనే సినిమా వివ‌రాల‌ను కూడా తెలియ‌జేస్తాన‌ని పేర్కొంది.

Anchor Suma Kanakala all set for silver screen comeback | 123telugu.com

అయితే సుమ అన్నంత ప‌నీ చేసింది. తాజాగా త‌న రీఎంట్రీ మూవీ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుద‌ల చేసింది. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించింది. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ నవంబర్ 6న రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపింది. బలగ ప్రకాష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ కలివరపు, అనుష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

Suma Kanakala Age, Wiki, Height, Biography, Family | Aktend.com

అలాగే ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండ‌డం విశేషం. ఇక ప్రీ లుక్ పోస్ట‌ర్ విష‌యానికి వ‌స్తే.. అందులో బియ్యం దంచడానికి సుమ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కానీ ఆమె ముఖం మాత్రం చూపించలేదు. అయితే ఆమె చేతిపై వెంకన్న అని పచ్చబొట్టు ఉండ‌టం ఆస‌క్తి రేపుతోంది. కాగా, `కళ్యాణ ప్రాప్తిరస్తు` చిత్రంతో వెండితెరకి ప‌రిచ‌య‌మైన సుమ‌..హీరోయిన్‌గా ప‌లు సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత యాంక‌ర్‌గా మారిన సుమ‌..మ‌ళ్లీ వెండితెర వైపు చూడ‌లేదు.

https://www.instagram.com/p/CVz-ubPJwGu/?utm_source=ig_web_copy_link

Share post:

Latest