అల్లుఅర్జున్ మరొక అరుదైన రికార్డ్..!

అల్లు అర్జున్, పూజ హెగ్డే కలిసి నటించిన చిత్రం అల వైకుంఠపురములో.. ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గత ఏడాది సంక్రాంతి  పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని పాటలు ఈ సినిమాకు సక్సెస్ కావడానికి దోహద పడ్డాయి. ఈ సినిమా పాటలు యూత్ లో ఒక ట్రెండ్ ని సెట్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ యాక్షన్ , డ్యాన్స్ కూడా ఈ మూవీలో హైలెట్ గా నిలిచాయి.

ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా రికార్డులను సృష్టించింది.ఈ సినిమాలోని బుట్ట బొమ్మ వీడియో సాంగ్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ పాటను యూట్యూబ్ లో ఎక్కువ మంది వీక్షించిన తెలుగు వీడియో సాంగ్ గా నిలిచింది. టాలీవుడ్ నుంచి అత్యధికంగా 700 మిలియన్ల వీక్షణాలతో పాటు, 4.4 మిలియన్ లైక్ లతో సరికొత్త రికార్డులను సెట్ చేసింది.

ఇక అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా విషయానికి వస్తే, పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్.ఈ సినిమా మొదటి భాగం డిసెంబర్ నెలలో విడుదల కానుంది.

Share post:

Latest