అలా చేసి శివ శంకర్ మాస్టర్ రుణం తీర్చుకున్న ఓంకార్..!!

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న శివ శంకర్ మాస్టర్ కరోనా పాజిటివ్ వచ్చి 75% ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కావడంతో ఆయన కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఇకపోతే ఆయన పెద్ద కుమారుడు అస్వస్థత కు గురి, ఆయన భార్య క్వారంటైన్ లో చికిత్స పొందుతూ ఉంది. ఆయన మరణించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఈయన మగధీర సినిమాతో ఏకంగా బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు

దేశీ, విదేశీ ప్రాంతాలలో కూడా కచేరీ నిర్వహించి ఎంతోమందికి తనలో ఉన్న ప్రతిభను కనబరిచారు. ఈయన కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు.. నృత్యకారుడు కూడా.. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.ఇక పోతే సోమవారం సాయంత్రానికి శివ శంకర్ మాస్టర్ దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ‘మహాప్రస్థానం’లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్‌ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు పంచవటి కాలనీలోని నివాసానికి పలువురు నటీనటులు, కళాకారులు హాజరై శివశంకర్ మాస్టర్‌కు నివాళులర్పించారు.

ఇక శివ శంకర్ మాస్టర్ దగ్గర ఎన్నో ఈ విషయాలను తెలుసుకొని ఆయనకు రుణపడి పోయిన ప్రముఖ యాంకర్ అలాగే దర్శకుడు , నిర్మాత ఓంకార్ ఆయన పార్థివ దేహానికి పాడె మోసి ఆయన రుణం తీర్చుకున్నారు.ఓంకార్ తోపాటు ఆయన సోదరుడు అశ్విన్ బాబు, శివశంకర్ మాస్టర్ పాడె మోసి మానవత్వాన్ని చాటుకున్నారు.

Share post:

Popular