ఆదిగాడు కనపడితే వాడి పని చెబుతానంటున్న.. హీరో అభిమానులు..!

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో లో ఎంతో మంది కమెడియన్స్ తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. ఇక అందులో ముఖ్యంగా హైపర్ ఆది గురించి చెప్పుకోవాలి. హైపర్ ఆది తన నటనతో, కామెడీతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తన పంచ్ లతో జడ్జిలను కూడా బాగా ఏడిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆది వేసే పంచ్ లు ఓ రేంజ్ లో పేలుతాయి అన్న విషయం అందరికి తెలిసిందే.. అయితే ఈ పంచులే ఆయనను ఇరుక్కునేలా చేశాయి.ముఖ్యంగా ఆది ఇటీవల జరిగిన ఒక షోలో హాజరై ఒక స్టార్ హీరోను తన పంచ్ లతో బాగా ఇమిటేట్ చేశాడు.

అయితే ఆ స్టార్ హీరో అభిమానులు హార్ట్ అయి ఆది బయట కనపడితే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు అట. అంతేకాదు ఒకసారి బయట కనపడి చూడు .. మా స్టార్ హీరో ఫాన్స్ ఏంటో నీకు చూపిస్తాము అంటూ వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతోంది. దీంతో ఆది ఇంట్లో ఉండలేక, ఇటు షూటింగ్ కి హాజరు కాలేక, తన సొంత వాహనంలో కూడా వెళ్ళలేక ఇబ్బందులు పడుతూ ఎక్కడో దాక్కున్నట్టు సమాచారం. అంతేకాదు మా స్టార్ హీరోపై ఇంకోసారి పంచులు వేయద్దు అంటూ కూడా వారు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారట.

Share post:

Latest