పునీత్‌కు అరుదైన గౌరవం..అప్పుడు తండ్రి, ఇప్పుడు త‌న‌యుడు!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29న తీవ్ర‌మైన గుండె పోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. కేవలం 46 సంవత్సరాల వయసులోనే పునీత్ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోవ‌డం యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ‌నే విషాదంలోకి నెట్టేసింది. మ‌రోవైపు ఆయ‌న మ‌ర‌ణాన్ని అభిమానులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు.

Enormous loss for Karnataka': CM pays tribute to actor Puneeth Rajkumar - India News

కేవలం సినిమా హీరోగానే కాకుండా ఆయన చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు ఈ రోజు ప్రజల గుండెల్లో పునీత్‌ను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. అటువంటి గొప్ప వ్య‌క్తికి మరణాంతరం అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే పవర్‌ఫుల్‌ అవార్డ్‌ అయిన `కర్నాటక రత్న`ను పునీత్‌కు నివాళిగా అర్పిస్తున్న‌ట్లు సీఎం బసవరాజు బొమ్మై తాజాగా ప్ర‌క‌టించారు. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ట్విటర్‌ వేదికగా తెలిపారు.

When Puneeth Rajkumar recreated his dad Rajkumar's iconic photo with a pigeon in Rajakumara - Movies News

కాగా, కర్ణాటక రత్న ఆ రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పురస్కారం. కర్ణాటక రత్న అవార్డును 1992లో స్థాపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది మందికి మాత్రమే ఆ ఆవార్డు లభించ‌గా.. వారిలో పునీత్ తండ్రి, లెజెండ్రీ న‌టుడు రాజ్‌కుమార్ ఒక‌రు. ఇక‌ మరణానంతరం ఈ అవార్డును అందుకున్న 10వ వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ నిలిచారు.