ఆ హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటున్న రాశిఖన్నా ..!

రాశి ఖన్నా.. మొదటిసారి టాలీవుడ్లోకి ఊహలు గుసగుసలాడే అనే ఈ సినిమా ద్వారా పరిచయం అయిన ఈ అమ్మడు..అందం, అభినయంతో పాటు నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా చేరువయ్యింది. ఇక ఆ తర్వాత అగ్ర హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశాలను కొట్టేసింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈమె ఒక్క విజయం కూడా సాధించలేక, కొంతవరకు తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉందనే చెప్పాలి. అయితే కోలీవుడ్లో మాత్రం అవకాశాలు రావడంతో అక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ అమ్మడు.. అయితే అక్కడ ఈమె నటించిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. ఇంకో సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

అంతేకాదు టాలీవుడ్ లో ఈమె మరో అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఈమె తన పరిధిని దాటి ఎక్స్ పోజింగ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే స్టార్ హీరోల సరసన నటించేందుకు ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచిన ఈ అమ్మడు, సాయి ధరమ్ తేజ్ సినిమా కోసం ఏమైనా చేస్తా అంటూ చెబుతోందట. సాయి ధరంతేజ్ తనకు మంచి ఫ్రెండ్ అని, ఇక అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని ఆమె తెలిపింది.. గతంలో కూడా సుప్రీం సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సంగతి తెలిసిందే.. ప్రతి రోజు పండగే సినిమా లో కూడా నటించారు. మంచి విజయాన్ని అందుకున్న ఈ కాంబినేషన్ మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని కొడుతుందని అందరూ అనుకుంటున్నారు.

Share post:

Latest