36 యేళ్ల తరువాత..ఫేస్ బుక్ ద్వారా తమ కుటుంబానికి దగ్గరైన మంగమ్మ..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అందరికీ ఏదో విధంగా ఉపయోగపడుతోంది. అయితే ఇప్పుడు తాజాగా 36 సంవత్సరాల కిందట తప్పిపోయిన ఒక మహిళ తన కుటుంబానికి దగ్గర చేసింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం .

ఇక అసలు విషయంలోకి వెళితే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం నీలివిడికి చెందిన క్యాసాని నాగన్న , తారక్ అమ్మ దంపతులు కూలిపని చేసుకుంటూ జీవించేవారు. వీరికి సత్యమ్మ, నాగేశ్వరమ్మ, మంగమ్మ, వెంకటేష్, కృష్ణ సంతాన కాగా..1985 లో హైదరాబాదులో ఒకరి ఇంట్లో పని చేసేందుకు ఏడేళ్లుగా మంగమ్మను ఒప్పందం కుదిర్చారు.

మూడు రోజులు అక్కడే ఉన్న ఆ తర్వాత తల్లిదండ్రుల పై బెంగతో బయటికి వచ్చేసింది. ఇక అదే ప్రాంతంలో భిక్షాటన చేస్తున్న ఒక వ్యక్తి తల్లిదండ్రుల దగ్గరకు పంపిస్తాం అని చెప్పి, గుంటూరు లోని వేమూరు మండలానికి చెందిన జంపన్న తీసుకెళ్లాడు. అక్కడ ఒక చర్చి వద్ద ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఇక అక్కడే భాస్కర్ నాయక్ పరిచయంతో చర్చి ముందు రోధిస్తున్న చిన్నారిని సాలమ్మ అనే ఒక ఆవిడ ఇంటికి తీసుకు వెళ్ళింది.

After 36 Years Woman Reunited With Her Family In Wanaparthy - Sakshi

ఇక వారి దగ్గరే పెరిగి 2019 వ సంవత్సరం లో క్రిస్టఫర్ తో వివాహం జరిపించారు. అయితే తన భార్య మంగమ్మ చెప్పిన విధంగా కొన్ని ఆధారాలను సేకరించి క్రిస్టఫర్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదే క్రమంలో భాస్కర్ నాయక్ అనే వ్యక్తి చూశాడు. ఇక ఆ వివరాలు తన సోదరి ఇ లాగే ఉండడంతో తన కుటుంబ సభ్యులతో చర్చించి, ఆ తరువాత మంగమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఇక మంగమ్మ తో పాటు తన భర్త దాసుని కూడా సోమవారం గ్రామానికి తీసుకువచ్చారు. ఇక దాంతో ఆమె ఆనందానికి అవధులు లేవు