డాక్టర్ వృత్తిని వ‌దిలి కోట్ల ఆస్తిని పోగొట్టుకున్న రాజశేఖర్..ఎలాగంటే?

సీనియ‌ర్ స్టార్ హీరో రాజశేఖర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంగ్రీ యంగ్ మాన్‌గా ప్రేక్షకుల గుండెల్లో త‌న కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రాజ‌శేఖ‌ర్.. ఎంత వేగంగా స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నాడో అంతే వేగంగా త‌న ఫామ్‌ను క‌ల్పోయాడు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతారు. కానీ రాజశేఖర్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌క‌ ముందే డాక్టర్.

Senior hero Rajasekhar to work with the award-winning director?

అవును, ఎమ్.బి.బి ఎస్ చేసిన రాజ‌శేఖ‌ర్‌ చెన్నైలో క్లినిక్ పెట్టి డాక్టర్‌గా ప్రాక్టీస్ కూడా పెట్టాడు. అయితే డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలోనే రాజశేఖర్ కి నటన వైపు గాలి మళ్లింది. దాంతో త‌న వృత్తిని వ‌దిలి పెట్టి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో నటన నేర్చుకున్న ఈయ‌న‌.. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘పుదుమాయ్ పెన్’ అనే త‌మిళ చిత్రంతో సినీ గ‌డ‌ప తొక్కాడు.

Rajasekhar, wife Jeevitha test positive for COVID-19 | Entertainment  News,The Indian Express

ఇటు 1885 లో వచ్చిన `వందేమాతరం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ‌శేఖ‌ర్ ఆ త‌ర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించి అన‌తి కాలంలో స్టార్ హీరోల చెంత చేరిపోయాడు. అంతేకాదు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి హీరోలకు తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చిన రాజ‌శేక‌ర్‌.. స‌హ‌న‌టి జీవిత‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు.

Tollywood actor Rajasekhar is steadily recovering from COVID-19: Jeevitha |  The News Minute

ఇక హీరోగా దూసుకుపోతున్న స‌మ‌యంలో రాజ‌శేఖ‌ర్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈయన హీరోగా తన సొంత బ్యానర్ లోనే ఎన్నో చిత్రాల్లో నటించారు. కానీ, అనూహ్యంగా ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బాల్తా ప‌డ్డాయి. దాంతో చేసేదేమి లేక‌ ఆయన చెన్నైలో ఉన్నటువంటి కోట్ల రూపాయల విలువచేసే ఇళ్లను అమ్ముకుని అప్పులు క‌ట్టార‌ట‌. మొత్తానికి అలా డాక్ట‌ర్ వృత్తిని వ‌దిలి సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన రాజ‌శేఖ‌ర్ కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నాడు.