మ‌హేష్ స‌రికొత్త బిజినెస్‌..వామ్మో ఈయ‌న మామూలోడు కాదు?!

సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మ‌హేష్ బాబు.. సొంత టాలెంట్‌తో తండ్రికి మించిన త‌న‌యుడిగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న మ‌హేష్‌.. తాను సంపాదించిన డబ్బులను నిర్మాణంతో పాటు ప‌లు వ్యాపారాల‌పై ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపార‌వేత్త‌గానూ స‌త్తా చాటుతున్నారు.

AMB Cinemas Second Venture In Hyderabad

గచ్చిబౌలిలో ఈయ‌న పేరు మీద విలాసవంతమైన `ఏఎంబీ` సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ఉంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటి. మ‌రోవైపు భార్య న‌మ్ర‌త‌తో క‌లిసి మ‌హేష్‌.. దుస్తుల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. అలాగే మ‌రిన్ని వ్యాపారాలు కూడా చేస్తున్న మ‌హేష్‌.. ఇప్పుడు స‌రికొత్త బిజినెస్ స్టార్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

Mahesh Babu and Namrata's Christmas is special as they fund a baby's heart  surgery - Movies News

ఆన్‌లైన్ విద్యా బోధన కోసం కొత్త యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడ‌ట మ‌హేష్‌. అందుకోసం ఒక మల్టీ నేషనల్ కంపెనీ తో చర్చలు జరుపుతున్నార‌ట‌. అంతే కాదు, ఈ బిజినెస్ కోసం మహేష్ బాబు దాదాపు వంద కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక త్వ‌ర‌లోనే దీనిపై మ‌రిన్ని వివారాలు బ‌య‌ట‌కు రానున్నాయి.

Mahesh Babu ventures in another new business two days before his 44th  birthday - IBTimes India

కాగా, మ‌హేష్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` చిత్రం చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ శ‌ర వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కావాల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల ఫిబ్ర‌వ‌రికి షిప్ట్ అయింది.

Share post:

Latest