తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టిన సమంత.. ఏ విషయమై అంటే..!

అక్కినేని నాగచైతన్య తో విడాకుల ప్రకటన తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక విషయమై వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత బాలీవుడ్ ఎంట్రీ పై పలు రూమర్స్ వస్తున్నాయి. సమంత ఇక తెలుగులో సినిమాలు తగ్గిస్తుందని.. బాలీవుడ్ లో మకాం వేస్తుందని ప్రచారం జరుగుతోంది. సమంత ముంబైకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి.

- Advertisement -

సమంత ఫ్యామిలీ మెన్ -2 వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో కూడా సమంత మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ వెబ్ సిరీస్ లో నెగటివ్ షేడ్స్ లో కనిపించిన సమంత మంచి నటనతో అందర్నీ ఆకట్టుకుంది. దీంతో ఇక సమంత వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తుందని, నటి తాప్సీ నిర్మాణ సంస్థలో ఓ సినిమాకు ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ రూమర్స్ పై సమంత స్పందించింది. ‘బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా బాలీవుడ్ లో సినిమాలు చేస్తా. నాకు కూడా అక్కడ సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉంది. భాష అనేది నాకెప్పుడూ సమస్య కాదు. కథ నచ్చిందా.. ఆ పాత్రకు నేను సూట్ అవుతునా..అని మాత్రమే చూస్తా. ఏదైనా ఒక ప్రాజెక్టు ఓకే చెప్పాలంటే ఈ విషయాలపై నన్ను నేనే ప్రశ్నించుకుంటాను’ అని సమంత తెలిపింది. ప్రస్తుతం సమంత తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తోంది.

Share post:

Popular