విజయ్ సేతుపతి పై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు..!

విజయ్ సేతుపతి తమిళ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకోలేక పోయినప్పటికీ తెలుగులో మాత్రం మోస్ట్ వాంటెడ్ విలన్ గా గుర్తింపు పొందుతున్నారు. ఎంతో మంది ప్రేక్షకులను గెలుచుకున్న విజయ్ సేతుపతి , ఏ పాత్ర ఇచ్చినా సరే తన ప్రతిభతో సులభంగా చేయగలనని ప్రూవ్ చేసుకున్నారు. అంతే కాదు తక్కువ సమయంలోనే పాన్ ఇండియా నటుడిగా పేరు కూడా పొందాడు..ఈయన నటించిన ఎన్నో సినిమాలు కూడా కలెక్షన్ పరంగా బాగానే సాధిస్తున్నాయి. తమిళ నటుడు అయినప్పటికీ మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలోనే ఈయనకు ఆఫర్లు వస్తున్నాయి..

ఇకపోతే ఇటీవల ఈయన నటించిన ఎన్నో సినిమాలు విడుదల అయ్యి ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయి. ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా మొహమాటపడి, ఏ సినిమా కథ వస్తే దానిని ఒప్పుకో కుండా ,సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా, సక్సెస్ అవుతాయి అని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి.. అంటూ విజయ్ సేతుపతి కి సలహా ఇస్తున్నారు. అంతే కాదు సినిమాలు విజయం సాధిస్తాయి అనుకునే సినిమాల కథలు మాత్రమే ఎంచుకోవాలని ఆయన అభిమానులు సూచనలు ఇవ్వడం గమనార్హం.

అయితే అభిమానుల సూచనలను దృష్టిలో పెట్టుకొని విజయ్ సేతుపతి నడుచుకుంటాడో లేదో మనం ఎదురు చూడాలి.

Share post:

Latest