నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చిన విద్యుల్లేఖ రామన్?

తెలుగు సినీ ప్రేక్షకులకు లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే పెళ్లి చేసుకొని తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు ఫిట్నెస్ న్యూట్రీషియన్ ఎప్పుడు సంజయ్ ను విద్యుల్లేఖ గత నెల 9వ తేదీన చెన్నైలో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవ్స్ కి వెళ్లారు.అయితే తాజాగా అక్కడ ప్రకృతిని ఎంజాయ్‌ చేస్తూ బికినీలో బీచ్‌లో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.ఏడాదికి రెండుసార్లు అంటే ఆరు నెలలకొకసారి వెకేషన్‌ను ఎంజాయ్‌ చెయ్యాలి అంటూ స్విమ్‌ సూట్‌, గాగుల్స్‌తో ఉన్న ఫోటోను పోస్ట్‌ చేసింది.

దీంతో ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఒక నెటిజెన్ అయితే విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు అన్న నెటిజన్‌ కామెంట్‌పై విద్యుల్లేఖ మండిపడింది.1920 నాటి కాలాన్ని వదిలి 2011కు రండి. నెగిటివ్‌ కామెంట్‌ సమస్య కాదు. సమాజం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణం అయితే చక్కగా, పద్ధతిగా దుస్తులు ధరించిన వాళ్లందరూ వారి వైవాహిక జీవితాల్లో సంతోషంగా ఉన్నారా? అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది.నీతి, నిజాయతీ విశ్వాసాలు కలిగిన భర్త లభించడం నా అదృష్టం. ఇక సంకుచిత వ్యక్తిత్వం ఉన్న మనుషులని నేను మార్చలేను. మీ జీవితంలో మహిళలు అంటే కేవలం శారీరక సుఖాన్ని ఇచ్చి, ఆణచివేత, అవమానాలను భరిస్తూ ఉండే వ్యక్తిలానే చూస్తున్నప్పుడు ఆమె వ్యక్తిత్వం మీకెక్కడ కనిపిస్తుంది అంటూ విద్యుల్లేఖ రామన్ కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చింది.

Share post:

Latest