`వరుడు కావలెను` బ‌రిలోకి దిగేది ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీ సౌజన్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రీతువ‌ర్మ హీరోయిన్‌గా న‌టించ‌గా..మురళి శర్మ, నదియా, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

- Advertisement -

Varudu Kaavalenu Teaser: A Colorful & Charming Romantic Tale

సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే నిన్నే విడుద‌ల అయ్యుండేది. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల నిర్మాత‌లు సినిమా విడుద‌ల‌ను వాయిదా వేశారు. అయితే తాజాగా వ‌రుడు కావ‌లెను కొత్త రిలీజ్‌ను అధికారికంగా మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 29న బ‌రిలోకి దింపుతున్నామ‌ని ప్ర‌క‌టిస్తూ ఓ అదిరిపోయే పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. కాగా, ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రి ఆ ఆంచ‌నాల‌ను శౌర్య ఏ మేర‌కు రీచ్ అవుతాడో అక్టోబ‌ర్ 29న తేలిపోనుంది.

Share post:

Popular