వారికి గాడిద చాకిరీ చేయవలసి వస్తోందని అంటున్న ఛార్మీ..?

ఛార్మి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలో ని హీరోయిన్ గా ఎదగడమే కాకుండా నిర్మాతగా కూడా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక ప్రస్తుతం కూడా ఈమె విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది. తాజాగా ఛార్మీ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.. ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

 

అందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ..ఒకప్పుడు హీరోయిన్ అయినా , ఇప్పుడు నిర్మాతగా మారిన తర్వాత గాడిద చాకిరి చేయాల్సి వస్తోందని తెలిపారు. నటన నిర్మాణం రెండు ఇష్టమయినా, ఈ రెండింటికీ అసలు పోలికే ఉండదు అని తెలిపింది ఛార్మి. ముఖ్యంగా హీరోయిన్గా చేసే సమయంలోనే కంఫర్ట్ ఎక్కువగా ఉండేదని కేవలం ఫిట్నెస్, బ్యూటీ మీద ఫోకస్ చేస్తే సరిపోయేది అని, కానీ నిర్మాతగా మారిన తర్వాత మాత్రం అందరి పనులు చూడాల్సిన బాధ్యత ఉంటుందని తెలిపింది.. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు గాడిద చాకిరీ చేయాలని , బాగా కష్టపడాలని తెలిపింది ఛార్మి.

Share post:

Latest