అక్కడ కొత్త అబార్షన్ చట్టం.. రోడ్డెక్కిన మహిళలు .. కారణం ఏమిటంటే ..!?

గర్భస్రావంపై అమెరికా మహిళలు రోడ్డెక్కారు. అబార్షన్ అనేది నేరం. అయితే అమెరికాలోని మహిళలు వేలాది మంది దీనిపై తమ నిరసనను తెలిపారు. అమెరికాలోని మహిళలకు చట్ట ప్రకారం దక్కాల్సిన హక్కులు దక్కడం లేదు. దీంతో తమ హక్కుల సాధన కోసం టెక్సాస్ సిటీ రోడ్లపై మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో మహిళలు ఆందోళన చేపట్టారు. సెప్టెంబర్ నెలలో టెక్సాస్ రాజధాని ఆస్టిన్ లో గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ ‘హార్ట్‌ బీట్‌’ చట్టంపై సంతకం చేయడంతో అలజడి రేగింది. ఆ చట్టానికి వ్యతిరేకంగా వందలాది మంది నిరసన తెలిపారు. ఆ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి తీవ్ర కలకలం రేపింది. ఈ టెక్సాస్‌ కొత్త చట్టం ప్రకారంగా చూస్తే గర్భస్థ పిండం గుండె కొట్టుకోవడం ప్రారంభమైతే అబార్షన్‌ చేయించుకోకూడదు. అలా చేయడం పూర్తిగా నిషేదం అని చట్టం చెబుతోంది. మామూలుగా చూస్తే గర్భంలో ఆరు వారాలకు పిండం పెరుగుతుంది. ఆ సమయంలో గుండె కొట్టుకోవడం ప్రారంభం అవుతుంది. చాలా మంది మహిళల్లో చూస్తే గర్భిణులని తెలియక 95% అబార్షన్లు అవుతున్నట్లు నిపుణులు కనుగొన్నారు.

ఒకవేళ సదరు మహిళ అత్యాచార బాధితురాలు అయితే.. లేదంటే మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఇటువంటి చట్టం వల్ల వారికి ఏ రకమైన మినహాయింపు ఉండదు. నిషేధాన్ని అతిక్రమించి అబార్షన్‌ చేయించుకున్నట్లైతే ఆ సర్కార్ పది వేల డాలర్లు ఫైన్ కూడా ఉంటుందని తెలిపింది. ఇది అత్యంత నిర్భందమైనదని, ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందేనంటూ మహిళలు నిరసన తెలిపారు. వాషింగ్టన్ లో నిరసన తెలిపిన వారు రెండు రోజులకు ముందు అమెరికా సుప్రీం కోర్టులో ఈ చట్టానికి వ్యతిరేకంగా పిటీషన్ వేశారు. ఇటువంటి చట్టం అమలు కాకుండా ఉండేందుకు అడ్డుకున్నారు. ఒకవేళ కోర్టు ముందుగానే ఈ చట్టాన్ని రద్దు చేయకుంటే ఏ రకమైన రూల్స్ లేకుండానే అమలు చేయడానికి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు సర్వహక్కులు ఉంటాయి. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన పిటీషన్లన్నింటినీ న్యాయస్థానం కొట్టిపారేసింది. అందుకే సెప్టెంబర్‌ 1 నుంచి ఆ చట్టం అమల్లోకి వచ్చి ఆ తర్వాత రానురాను వివాదాస్పదంగా తయారైంది.

Share post:

Latest