తిరుమల భక్తులకు శుభవార్త …!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల వెంకటేశుని దర్శనానికి భక్తుల రకపోకలకు టీటీడీ అనుమతి రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే. లాక్ డౌన్ సడలింపు తర్వాత శ్రీవారి దర్శనానికి టికెట్లు గత నెలలో ఆపేశారు. నవంబరు నెలకు సంబంధించిన రూ. 300 దర్శన టిక్కెట్లు, ఉచిత దర్శన టోకెన్లు ఆన్లైన్లో విడుదలకు సన్నద్ధమైంది. తిరుపతి బస్టాండ్ సమీపంలోని శ్రీ శ్రీనివాస ప్రాంగణం లో టోకెన్ల జారీ తిరిగి ప్రారంభించనున్నారు.

సెప్టెంబర్ నెలలో ఉచిత టోకెన్లు కేవలం కొన్ని గంటల్లోనే ఆన్లైన్లో పంపిణీ చేశారు. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 దర్శన టిక్కెట్లు , ఉచిత దర్శన టోకెన్లు ఈ నెల 22, 23 తేదీల్లో ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 22 నుంచి ప్రతి రోజు 12 వేల టిక్కెట్లు, 23 న ఉచిత దర్శన టోకెన్ల ను ఆన్లైన్లో రోజుకు పది వేల చొప్పున జారీ చేశారు.

Share post:

Popular