ఫిల్మ్ మేకింగ్ లో నాకు నచ్చింది అదే.. డైరెక్టర్ క్రిష్?

దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా నటించిన సినిమా కొండపొలం. ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా కు సంబంధించి పలు విశేషాలను పంచుకున్నారు దర్శకుడు క్రిష్. కరోనా సమయంలో ఒకసారి దర్శకులు అందరూ కలిసినప్పుడు కొండపొలం నవల గురించి ఇంద్రగంటి మోహన కృష్ణ, సుకుమార్ ఈ కథ చెప్పడంతో చదివాను. నాకు నచ్చడం తో ఈ సినిమాను తీసాను అని దర్శకుడు తెలిపాడు. ఆ సమయంలో సప్తభూమి కొండపొలం అనే పుస్తకాలు చదివాను. ఇందులో కొండపొలం బాగా నచ్చడంతో ఆ నవల రచయిత సన్నపురెడ్డి ని కలిసి హక్కులు తీసుకున్నాం.

కొండపొలం హక్కులు కొన్నావా అని సుకుమార్ అడగడంతో నేను తీసుకున్నాను అని చెప్పడంతో సుకుమార్ వదిలేశారని చెప్పారు.సన్నపురెడ్డి కొండపొలం అద్భుతమైన కథ. ఇందులో ఓబులమ్మ పాత్ర ఉండదు. కానీ దానికి అందమైన ప్రేమ కథలు జోడిస్తే బాగుంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాను. దానికి సన్నపురెడ్డి కథనం రాయడం వల్ల నాకు సులభం అయింది అని తెలిపారు. ఇక వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారని యాటిట్యూడ్ ఉండదు తనకు నేర్చుకోవాలన్న తపన ఎంతో ఉంది. అందుకే ఉప్పెన కొండపొలం లాంటి కథలు ఎంచుకున్నాడు.

ఇక ఈ ఓబులమ్మ పాత్రకు రకుల్ అయితే సరిపోతారని కెమెరామెన్ చెప్పడంతో ఆమెను ఎంచుకున్నానని తెలిపారు.కొండపొలం కోసం సంగీత దర్శకునిగా కీరవాణి గారి తనయుడు కాలభైరవ కి ఫోన్ చేశాను. మీకంటే ముందు ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశానని భవాని గారికి చెప్పడంతో ఎవరు అన్నారు. నేను కాలభైరవ అంతే నవ్వారు. అప్పుడు కీరవాణిగారు ఎవరు కావాలో నువ్వే తేల్చుకో అని అనడంతో మీరే కావాలి అన్నాను. ఫిలిం మేకింగ్ లో నాకు నచ్చింది రచనే అని క్రిష్ తెలిపారు.

Share post:

Latest