తన భర్తను వారే చంపేశారు అంటున్న ఆర్కే భార్య శిరీష..!!

మావోయిస్టు లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన రామకృష్ణ అలియాస్ ఆర్కే ఇటీవల మరణం చెందిన విషయం తెలిసిందే..అయితే తన భర్తను కావాలనే ప్రభుత్వమే చంపేసింది అంటూ ఆయన భార్య శిరీష సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.అనారోగ్యం పాలైన తన భర్తకు వైద్యం అందించకుండా పోలీస్ శాఖ ప్రయత్నించిందని ఆమె ధ్వజమెత్తారు. అడవి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి వైద్యం అందకుండా చేసి చంపేశారని శిరీష ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టులకు సహకరించకుండా గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

మావోయిస్టులకు చేరే ఆహారంలో విషం కలిపారు అని ప్రభుత్వాలు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజల గుండెల్లో ఆర్కే చిరస్థాయిగా మిగిలిపోతారు అంటూ శిరీష తెలిపింది.అణగారిన వర్గాలు..బడుగు బలహీన వర్గాల వారి కోసం తన భర్త అమరుడయ్యారన్నారు. ప్రజల కోసం పోరాడతాం.ప్రజల కోసం చస్తాం అంటూ సాగిన పోరాటంలో తన కుమారుడిని కూడా పోగొట్టుకున్నామని..ఇప్పుడు ఆర్కేను కూడా కోల్పోయామని శిరీష కన్నీటి పర్యంతమయ్యారు.

ముఖ్యంగా పోలీసుల వల్లే తన భర్త చనిపోయాడు అంటూ ప్రముఖ మావోయిస్టు నేత ఆర్కే భార్య శిరీష ఆగ్రహం తో పాటు ఆవేదన కూడా వ్యక్తం చేస్తోంది.

Share post:

Latest