దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఈ సామెత ఎక్కువగా సెలబ్రిటీలకు వర్తిస్తుంది అని చెప్పవచ్చు . ఎందుకంటే హీరో హీరోయిన్లు వారు మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఒకవైపు సినిమాలను చేస్తూ మరొక వైపు బిజినెస్ చేస్తూ వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఇలా ఇప్పటికే సినిమాల్లో నటిస్తూ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. నాగార్జున కూడా ఒకప్పుడు బిజినెస్ చేయాలని భావించారట. నాగార్జునకు హీరోయిన్ టబు కు మధ్య మంచి రిలేషన్ ఉండేదట.
దీంతో వీరి మధ్య ఉన్న రిలేషన్ కారణంగా వీరిద్దరూ కలిసి ఒక హాట్ ఫుడ్ బిజినెస్ లేదని భావించారట. ఈ నేపథ్యంలోనే వారి బిజినెస్ కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని భావించిన నాగార్జునకు తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అడ్డుపడ్డారట. సినిమా రంగంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న నాగార్జున ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరొకవైపు వ్యాపార రంగంలో ముందుకు సాగాలి అంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందువల్ల ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఈ రంగంలోకి దిగాలని తెలిపారట. అయితే అప్పట్లో ఇప్పుడు ఉన్నంత సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపార రంగం ఆలోచన నుంచి నాగార్జున వెనకడుగు వేసినట్లు సమాచారం. కానీ ప్రస్తుతం నాగార్జున సినిమాలతో పాటు పలు రకాల బిజినెస్లు చేస్తుండడం గమనార్హం.