సూసైడ్ చేసుకోవాల‌నుకున్న షణ్ముఖ్‌..కార‌ణం ఆమేన‌ట‌..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడో వారం కొన‌సాగుతోంది. మొత్తం 19తో ప్రారంభ‌మైన ఈ షో నుంచీ ఇప్ప‌టికే ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం ఉన్న ఇంటి స‌భ్యుల్లో కొందరు ఎలాగైనా ట్రోఫీ కొట్టాలని కసిగా ఆడితే మరికొందరు మాత్రం ఎక్కువ వారాల పాటు హౌస్‌లో నిల‌దొక్కుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

- Advertisement -

Shanmukh Jaswanth Wiki, Age, Bio, Family, Filmography - The Biographys

ఇదిలా ఉంటే.. తాజాగా ఇంటి సభ్యులకు కోల్ గేట్.. స్మైల్ చేయండి.. స్టార్ట్ చేయండి అనే టాస్కును ఇచ్చారు. ఇందులో భాగంగానే ఇంటి స‌భ్యులంద‌రూ త‌మ జీవితంలోని జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ మాట్లాడుతూ.. ఇంటర్‌ సెకండియర్‌ తర్వాత బెంగళూరులో సీటు వచ్చింది. అదే సమయంలో నేను ప్రిమించిన అమ్మాయి నాకు బ్రేక‌ప్ చెప్పి వెళ్లిపోయింది. నా సగం జీవితం పోయిందని చాలా బాధ ప‌డ్డా.

Official: Deepthi Sunaina loves Shanmukh Jaswanth

ఆమె వ‌ల్ల సూసైడ్‌ చేసుకుందామనుకున్నా, సరిగ్గా అదే సమయంలో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ వచ్చి డోర్‌ కొట్టాడు. కానీ నేను తీయలేదు. తర్వాత అతడు నేరుగా లోపలకు వచ్చి నాలుగు పీకాడు. వాడివల్లే నేను బతికున్నాను. వైవా అనే షార్ట్‌ ఫిలిం ద్వారా నాకు బ్రేక్‌ వచ్చింది. నా ఫేస్‌లో స్మైల్‌ తెప్పించిన పేరెంట్స్‌, కజిన్స్‌కు రుణపడి ఉంటా` అంటూ చెప్పుకొచ్చారు. కాగా, యూట్యూబ్ స్టార్‌గా దూసుకుపోతున్న షణ్ను.. ప్ర‌స్తుతం దీప్తి సునైనాతో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Share post:

Popular