సెట్లో వెళ్ళగానే..నిర్మాతలు నా దుస్తులను చింపేస్తారంటున్న నటి..?

సంచలన ఆరోపణలు చేసింది బిగ్ బాస్ ఓటిటి ఫేం ఉర్ఫి జావేద్. ‘బాదే భయ్యా కి దుల్యానియా’ సీరియల్తో పేరు తెచ్చుకున్న ఆమె మేరీ దుర్గా అనే సీరియల్ తో మంచి నటిగా గుర్తింపు పొందారు.. ఇటీవల ఈమె  టీవీ బిగ్ బాస్ హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె కొన్ని సంచలన విషయాలను కూడా తెలియజేసింది.

తన గురించి తన కుటుంబం గురించి కొన్ని విషయాలను కూడా చెప్పుకొస్తోంది. తను సినిమాల్లోకి రాకముందు ఎలాంటి కష్టాలు పడిందో వెల్లడించింది. ఈమె సినీ ఇండస్ట్రీ లోకి వెళ్ళడానికి వారి ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదట. నెలకి మూడు వేల రూపాయలతో చిన్న ఉద్యోగంలో చేరి సినిమా అవకాశాల కోసం ఎంతోమంది కలిసినప్పుడు తెలియజేసింది.

చాలాసార్లు ఖాళీ కడుపుతోనే పడుకునే దానివి అంటూ చెప్పుకొచ్చింది. ఆఫర్ ఇచ్చినట్లు ఇచ్చి తర్వాత నో చెప్పే వారన్నారు నిర్మాతలు అంటు తెలిపింది. ఇక ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందని అందుకు ఓకే చెప్పి కాంట్రాక్ట్ పేపర్ మీద కూడా సంతకం చేశానని తెలియజేసింది. ఇక షూటింగ్ లో భాగంగా మొదటిరోజు సెట్ లోకి వెళ్ళగానే.. స్క్రిప్టులో లేనివిధంగా సీన్ చేయమని అని నిర్మాతలు చెప్పడంతో ఆమె నో చెప్పిందట.

సెట్ లోకి వెళ్ళగానే ఒక మహిళతో అసభ్యకరంగా నాతో మాట్లాడింది. తను వేసుకున్న బట్టలు తీసేయాలి అంటూ లాగింది అంటే చెప్పు వచ్చింది ఇమే.