మనసులో మాట బయట పెట్టిన సమంత.. ఆ విషయంలో పశ్చాత్తాపడుతుందా?

ప్రస్తుతం సమంత తన ఫ్రెండ్స్ తో కలిసి దుబాయ్ లో ఉంది. ఇటీవలే తన ఫ్రెండు శిల్పారెడ్డి తో కలసి తీర్థయాత్రలలో పాల్గొన్న సమంత, అనంతరం సాధన సింగ్, ప్రీతమ్ జుకల్కర్ తో కలిసి దుబాయ్ కి వెళ్ళింది. భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు అయితే ఏదైనా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. దుబాయ్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి వీధుల్లో చక్కర్లు కొడుతూ, అక్కడ రెస్టారెంట్లలో వెరైటీ ఫుడ్స్ ను తింటూ ఎంజాయ్ చేస్తోంది.

ఇక నాగచైతన్య మెమోరీస్ నూతన దగ్గర ఉంచుకునేందుకు సమంత కు ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ నుంచి చైతన్య ఫోటోలను డిలీట్ కూడా చేసింది. తాజాగా సమంత చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఫ్రెండ్ సాధన సింగ్ సమంతతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయగా, అందుకు సమంతా కామెంట్ పెట్టింది. సమంత ఎంతో అందంగా ఉందని కామెంట్ చేసింది సాధన. దీనికి సమంతా రిప్లై ఇస్తూ సెల్ఫ్ లవ్ అన్నిటికంటే బెస్ట్ అంటూ సమంత తెలిపింది. అయితే ఇది వరకే సమంత వేరేవాళ్లను ప్రేమించి తప్పు చేసిందా? అందుకే సెల్ఫ్ లవ్ బెటర్ అని రియలైజ్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share post:

Latest