సమంత, చైతన్య బంధం ముగియలేదు.. ఇంకా ఉంది..ఎందుకంటే…!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ పెద్ద షాకే ఇచ్చారు. ఈ వార్తను జీర్ణించుకోవడానికి అటు అక్కినేని అభిమానులకు ఇటు సమంత అభిమానులకు చాలా సమయమే పట్టింది. ఇద్దరు విడిపోవద్దు అంటూ వారి వారి అభిమానులు సోషల్ మీడియాలో మెసేజ్ లు కూడా పెట్టారు. కొంతమంది తప్పంతా సమంతాదేనంటూ ట్రోల్స్ కూడా చేశారు.

ఇక ప్రస్తుతం నాగచైతన్య సమంత విడివిడిగా ఉంటున్నారు. సమంత చెన్నై లో ఉంటుండగా.. నాగ చైతన్య హైదరాబాద్ లో ఉంటున్నాడు. అయినప్పటికీ వీరి భార్య భర్తల బంధం అధికారికంగా ఇంకా ముగియలేదు. ప్రస్తుతం వీరు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అది ప్రాసెస్ లో ఉంది. కోర్టు రూల్ ప్రకారం విడాకులకు దరఖాస్తు చేసుకున్న వారికి రెండు లేదా మూడు సార్లు కౌన్సిలింగ్ ఇస్తారు. దంపతులు ఏమైనా తమ నిర్ణయాన్ని మార్చుకుంటారేమోనని చూస్తారు. సమంత, నాగచైతన్య సెలబ్రిటీలు కావడంతో కోర్టుకు హాజరు అవుతారో లేదో చూడాల్సి ఉంది.

వీరికి వచ్చే ఏడాది జనవరిలో విడాకులు మంజూరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత సమంత, నాగచైతన్య మరోసారి అధికారికంగా విడాకుల గురించి ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వీరు విడిపోయినట్లు ప్రకటించినా విడాకులు వచ్చేంత వరకు వీరి భార్య భర్తల బంధం కొనసాగనుంది. ప్రస్తుతం నాగ చైతన్య, సమంత తాము ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు.

Share post:

Latest