శ్యామ్ – చైతూ విషయంపై బుర్ర వాడండి అంటూ ఫైర్ అవుతున్న వెంకీ..!

సమంత – నాగచైతన్య విడాకులు విషయంపై మొదటిసారి వెంకీ ఫైర్ అయ్యాడు.. ఏ విషయాన్ని అయినా చాలా కూల్ గా డీల్ చేసే వెంకటేష్ తన మేనల్లుడు విషయంలో చాలా ఫైర్ అవుతున్నాడు. నిజానికి వెంకటేష్ కు .. నాగచైతన్య చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వార్తలు వస్తుండడంతో ఆయన తట్టుకోలేక అందరిపై ఫైర్ అవుతున్నాడు. ఇంతకూ ముందు బుర్ర వాడండి అంటూ కూడా కోప్పడ్డంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

మేనల్లుడు విడాకుల విషయం పై వస్తున్న ఈ వార్తలపై వెంకటేష్ స్టేటస్ ల ద్వారా ఆయన మనసులో ఉన్న మాటను చెప్పేశాడు. ఈ పోస్ట్ ను బట్టి చూస్తే ఏం జరిగిందో తెలుసుకోకుండా పిచ్చి రాతలు రాయడంపై ఆయన బాగా హర్ట్ అయినట్లు అర్థం అవుతుంది.
అందుకే ఆయన ఇన్‌స్టా పోస్ట్ లో కూడా పెట్టాడు. మనం ఏదైనా విషయంపై పెదవి విప్పి చెప్పే ముందు కాస్త బుర్ర కూడా పెట్టాలి’ అంటూ రాసుకొచ్చాడు వెంకీ.

ఇక ‘బుర్ర అనేది ఒక ఆలోచన పుట్ట.. మనం వెళ్లే మార్గాన్ని చాలా జాగ‍్రత్తగా ఎంచుకోవాలి’ అంటూ మరో పోస్ట్ పెట్టాడు. ఈ రెండు పోస్టులు కచ్చితంగా నాగ చైతన్య, సమంత విడాకుల గురించే అనేది అర్థమవుతోంది. ఏదిఏమైనా ఇద్దరి వైవాహిక జీవితం పై ఇలాంటి వార్తలు రాయడం తప్పు అంటూ తెలియజేశాడు వెంకటేష్.