సాయి ధరంతేజ్ రిపబ్లిక్ మూవీ గురించి.. రివ్యూ చెప్పిన హరీష్ శంకర్..!

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరంతేజ్ సుప్రీం సినిమాతో యువ హీరోలలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక మొన్నామధ్య సాయి ధరంతేజ్ బైక్ లో వెళ్తున్నప్పుడు స్కిడ్ అయ్యి రోడ్ యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సానుభూతి తెలిపారు.. ఈ సినిమా ఈ రోజు అక్టోబర్ 1వ తేదీ సందర్భంగా విడుదల అయింది..

- Advertisement -

అయితే తాజాగా మీడియా మిత్రులకు అలాగే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షో వేయగా దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ సినిమా వీక్షించారు..తర్వాత రిపబ్లిక్ సినిమాపై ట్విట్టర్ వేదికగా ఆయన ఇలా స్పందించడం జరిగింది.

రిపబ్లిక్ సినిమా చూశాను.. సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమా తన సినీ కెరీర్ లో బెస్ట్ గా నిలవడం ఖాయం.. మంచి నిజాయితీ కథను తీసుకొచ్చిన దర్శకుడు దేవాకట్టా అభినందనలు అంటూ తెలియజేశాడు. ఇక జగపతి బాబు, రమ్య కృష్ణ, ఐశ్వర్య రాజేష్ లు వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారని ట్వీట్ చేశాడు.

Share post:

Popular